రూటర్ లో పడి ఒకటవ తరగతి బాలుడు మృతి

రూటర్ లో పడి బాలుడు మృతి

గండీడ్, అక్టోబర్ 12, (మన సాక్షి) : మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని రూటర్ లో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన గండీడ్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గండీడ్ మండల పరిధిలోని చిన్నవార్వాల్ గ్రామంలో సానేం కార్తీక్ (7) తండ్రి అనిల్ కుమార్ పొలంలో పనులు చేస్తుండగా.. రూటర్ లో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సానేం కార్తీక్ కోస్గి పట్టణంలోని వేద పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు.