TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్వ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

మన సాక్షి , అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అనంతరం మంత్రివర్గ సమావేశంపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనున్నది. మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు సాగనున్నాయి.

ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకానికి 20వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయాల్సింది. దీనిపై కీలకంగా చర్చించి ఈ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు.

దాంతోపాటు ఉద్యోగులకు 26 వేల కోట్ల రూపాయల మేర చెల్లింపులు బకాయిలు ఉన్నాయి. వాటిలో కొంతమేర చెల్లించే దిశగా నిర్ణయం తీసుకోనన్నారు. పెండింగ్ డిఎల్ పైన ఈ సమావేశంలో చర్చించి.. ఒక విడత చెల్లింపులకు ఆమోదించే అవకాశం ఉంది. దాంతో పాటు పిఆర్సి ఏర్పాటు పైన కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు.

వీటితోపాటు మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం, పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పైన చర్చించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశ పెట్టె బడ్జెట్ పైన కూడా చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం అందజేయగా ఈ ప్రభుత్వం ఆ పథకానికి అన్నదాత సుఖీభవ గా పేరు మార్చింది. కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ. 20వేల పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పథకంకు ఎంత మంది రైతులు అర్హులు ఉన్నారనే లెక్కలు తేల్చింది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మన్ తో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం రైతు భరోసా పథకానికి ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ ; 

  1. Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

  2. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  3. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు