Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!
Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం శుక్రవారం ఆరు ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు ఖాతాలలో జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుండగా వానాకాలం సీజన్ కు గాను శుక్రవారం రైతుల ఖాతాలలో జమ చేసింది.
శుక్రవారం 6 ఎకరాల వరకు ఉన్న రైతులకు 36 వేల రూపాయలను ఒకేసారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. గురువారం వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఎకరానికి 6000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయగా శుక్రవారం 6 ఎకరాల వరకు ఉన్న వారికి డబ్బులు జమ చేసింది.
అయితే శనివారం 7 ఎకరాలు, ఆదివారం 8 ఎకరాలు, సోమవారం 9 ఎకరాలు, మంగళవారం 10 ఎకరాలకు పైగా పొలాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. 24వ తేదీ నాటికి మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ పథకం పంపిణీ పూర్తయ్యాలా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విధంగా 70 , 11, 984 మంది రైతులకు 9000 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం పూర్తి చేయనున్నది.
MOST READ :
-
District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!
-
Rainy Season: వర్షాకాలంలో దోమల బెడద తగ్గించుకోండిలా..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!









