TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు.. కీలక అప్డేట్..!

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ముగిసి రెండు మాసాలకు పైగా గడిచినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Rythu Bharosa : రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు.. కీలక అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో.

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ముగిసి రెండు మాసాలకు పైగా గడిచినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య మంత్రి పలుమార్లు ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాలలో వేస్తామని మిర్యాలగూడ బహిరంగ సభలో పేర్కొన్నప్పటికీ అమలు కాలేదు.

రైతులు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఖాతాలలో డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ఫిబ్రవరి 23వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కూడా రైతు భరోసా గురించి చర్చిస్తారని ఆశతో ఎదురు చూశారు. అయినా కూడా ఎలాంటి ప్రకటన లేదు. దాంతో రైతు భరోసా నిధులు రైతులకు ఇప్పట్లో అందే అవకాశం కనిపించడం లేదు.

పరిషత్ ఎన్నికలు :

తెలంగాణ ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాగా రైతులకు రైతు భరోసా నిధులు కూడా పరిషత్ ఎన్నికలకు ముందు జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నందున పరిషత్ ఎన్నికలు మే నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో ఏప్రిల్ నెలలో జమ చేస్తారా..? అని ఆలోచనలో రైతులు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు రైతు భరోసా పథకం ద్వారా జమ చేసే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం ఎకరానికి 12,000 రూపాయలను జమ చేయాల్సి ఉంది. కాగా మొదటి విడత వానాకాలం 6000 రూపాయలను జమ చేయగా రెండవ విడత యాసంగి ఎకరానికి 6000 రూపాయలను జమ చేయాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు