Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Indiramma Houses : రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం..!

రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Indiramma Houses : రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం..!

మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మిదిగా ప్రారంభోత్సవం

రాష్ట్ర పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్నగర్, మనసాక్షి:

రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో 125 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్లను రాష్ట్ర హోజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్ లోఏర్పాటు చేసిన మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2011 లో నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లులో పనిచేసే వారికి ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి పనులు ప్రారంభించడం జరిగిందని కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసి డంపింగ్ యార్డ్ మాదిరిగా మార్చిందని మండిపడ్డారు.

తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14 సంవత్సరాల నా పట్టుదల , కృషి ఆకాంక్షలతో తిరుగి పనులను ప్రారంభించి ప్రాజెక్టును పూర్తిచేసి పేద ప్రజలకు అందించడం నా చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నానని, 1 ప్లాట్ కు రూ. 6 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని ఒక్క ఫ్లాట్ విస్తీర్ణం 325 స్క్వేర్ ఫీట్ ఉంటుందని వివరించారు. రూ.75కోట్లతో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కొరకు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించినట్లు వెల్లడించారు.

ALSO READ : Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!

మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో హుజూర్నగర్ లోకల్ లో ఇండ్లు లేని వారికి, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన 1000 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. రెండవ విడతలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని పేదలకు అందించడం జరుగుతుందని ఎంపిక ప్రక్రియలో ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, తాసిల్దార్ లు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు.

ఎంపిక విషయంలో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్పీ కే నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు