Breaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : సాగర్ కాలువలు ఇలా.. నీరు పారేది ఎలా..!

Miryalaguda : సాగర్ కాలువలు ఇలా.. నీరు పారేది ఎలా..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు వానాకాలం పంటలకు నీటిని విడుదల చేశారు. ఇటీవలనే పంట కాలువలు మేజర్, మైనర్ కాలువలకు కూడా నీటిని విడుదల చేశారు. కానీ పంట కాలువల్లో కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీరు పారే పరిస్థితి లేకుండా పోయింది. గత మూడు సీజన్లలో కాలువలకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల కాలువల్లో కంపచెట్లు మొలిచాయి.

ఇసుక మేటలు ఉన్నాయి. దాంతో రైతులకు కాలువ చివరి భూములకు నీరందటం కష్టంగా మారింది. కాగా పంట కాలువల పరిస్థితిని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు.

మూడు సీజన్లలో పంటలకు సాగునీరు లేకపోవడంతో కాలువలు, కుంటలలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు వ్యర్థ పదార్థాలతో నిండిపోయాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు తండా గ్రామ శివారులో ఉన్న కృష్ణాపురం మేజర్ కాల్వలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది వర్షాలు లేని కారణంగా సాగునీరు లేక పంటలు సాగు కాలేదని తెలిపారు. రెండు సంవత్సరాల పాటు నీళ్లు రానీ కారణంగా కాలువలలో కంప చెట్లు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని ముఖ్యంగా వ్యర్థ పదార్థాలుతో నిండి ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం సాగునీరు విడుదల చేసినప్పటికీ కాలువలలో వ్యర్ధాలు ఉండటం వల్ల నీరు కిందికి వాడటం లేదని దాని ఫలితంగా పంట పొలాలకు నీరు అందడం లేదని చెప్పారు. కాలువలను శుభ్రం చేయాలని కాలువలకు ఇరువైపులా లైనింగ్ పనులు పూర్తి చేయాలని, రైతుల ఎన్నిమార్లు కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

సాగునీరు వస్తుందని ఆశతో రైతులు పంటను సాగు చేసుకుంటున్నారని ఇప్పుడు ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నారని కాలువలను వ్యర్ధాలు ఉండడం వల్ల పంట పొలాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలువలను శుభ్రం చేసి కింది పంటలకు నీరందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సి ఈ నాగేశ్వరరావు, ఈఈ లక్ష్మణ్ నాయక్ సమస్యను వివరించారు. స్పందించిన వారు తక్షణమే కాలువల పూడిక తీస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీనియర్ నాయకులు జగదీష్ చంద్ర, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, వ్యవసాయం కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లుట్ల సైదులు బాలాజీ నాయక్, సాగర్ నాయక్, సత్యనారాయణ, శ్రీను, హనుమంతు నాయక్, మంగ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

Runamafi : రుణమాఫీ అయినా.. ఆ డబ్బులు చెల్లించాల్సిందే, బ్యాంకులకు వెళ్తే అసలు విషయం..!

మరిన్ని వార్తలు