తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!

Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రెండు తెలుగు రాష్ట్రాలకు త్రాగు, సాగునీరు అందించే నాగార్జునసాగర్ జలాశయం ఖాళీ అవుతుంది. వేసవి సమీపిస్తుండగానే సాగర్ జలాశయంలో నీరు అడుగంటి పోతుంది. ఎంత వడివడిగా సాగర్ జలాశయంలోకి కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ వచ్చిందో.. అంతే వడిగా నీరు కూడా ఖాళీ అవుతోంది.

గతంలో నాగార్జునసాగర్ జలాశయం ఒక ఏడాది పూర్తిస్థాయిలో నిండి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లయితే దాదాపుగా రెండు సంవత్సరాల పాటు సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటికి డోకా లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రెండు పంటలకు సరిపడా నీటిని మాత్రమే వినియోగించగలుగుతున్నాం.

నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ కాలువల పరిధిలో సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వానాకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయగా యాసంగి సీజన్ లో వారబంధి చొప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయినా కూడా జలాశయం అడుగంటి పోతుంది.

గత ఏడాది సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతోపాటు క్రస్ట్ గేట్లను కూడా అనేక పర్యాయాలు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన దాఖలు ఉన్నాయి. కానీ సాగర్ జలాశయం మాత్రం వేసవికి ముందే నీరు అడుగంటి పోతుంది.

సాగర్ జలాశయ నీటిమట్టం :

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 538.80 అడుగుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం 185.8360 టీఎంసీల (TMC) నీరు ఉంది. నాగార్జునసాగర్ కుడి కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాలువకు 8718 క్యూసెక్కుల నీటిని, విద్యుత్ ఉత్పాదనకు 8224 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ ఎల్ బిసి కి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ కు 10,102 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా 29,222 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

వానాకాలం పంటలకు మళ్లీ నిండితేనే :

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ప్రస్తుత పంటలకు నీటిని విడుదల చేయడంతో పాటు వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. తాగునీటికి యాసంగి సీజన్ సాగుకు నీరు వినియోగించగా సాగర్ జలాశయం మరింత ఖాళీ అయ్యే అవకాశం ఉంది. 2025 వానాకాలం సీజన్ కు వర్షాలు పడితేనే సాగునీటికి డోకా లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్షాల కోసం అన్నదాతలు మళ్లీ ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది.

■ MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!

  3. Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!

  4. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!

మరిన్ని వార్తలు