Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : జన సముద్రమైన సాగర్.. సందర్శకుల నిరాశ..!

Nagarjunasagar : జన సముద్రమైన సాగర్.. సందర్శకుల నిరాశ..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ జన సముద్రం అయింది. నాగార్జునసాగర్ డ్యాము గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతూ ఉండడంతో ఆ సుందర జల విన్యాసాలను వీక్షించడానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుండి సందర్శకుల రాక మొదలైంది.

ఆదివారం సెలవు కావడంతో సాగర సందర్శనకు భారీగా తరలివచ్చారు. కాగా సాగర్ గేట్లు మొత్తం ఎత్తి ఉండటాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశ ఎదురయింది. పైనుంచి వరద తగ్గడంతో కేవలం ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దాంతో సందర్శకులు నిరాశకు గురయ్యారు.

ఆదివారం ఉదయం 10 గంటల వరకు సాగర్ డ్యాం 26 గేట్లను ఎత్తి దిగువనకు నీటి విడుదల చేసిన అధికారులు ఎగువ భాగము నుండి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సాగర్ డ్యాం గేట్లను ఒక్కొక్క గేటును తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 8 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు.

సాగరుకు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సాగర్ లోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. నాగార్జునసాగర్ డ్యాం దిగువ భాగాన, కొత్త బ్రిడ్జి వద్ద, ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్ద, విజయ విహార్, బుద్ధవనం వద్ద జన సముద్రం లాగా సందర్శకులు కనిపించారు.

ఆదివారం నాగార్జునసాగర్ లోని ప్రధాన రహదారులలో పలుమార్లు ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోగాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా నాగార్జునసాగర్ జలాశయం లో టూరిజం లాంచీల రాకపోకలు గత రెండు రోజులుగా నిలిపివేయడంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నిరాశకు గురి అయినారు.

ALSO READ : 

Nagarjunasagar : సాగర్ సందర్శించిన సినీ యాక్టర్ లయ..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే.. ప్రముఖులు..!

Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!

Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!

Tungabhadra : కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. దిగువకు ఫోటెత్తిన నీరు..!

మరిన్ని వార్తలు