తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి..!

Miryalaguda : ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతిని సోమవారం మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మొగలాయులపై పోరాడిన యోధులు అన్నారు. మొగలాయుల కాలంలో నిమ్న కులంలో పుట్టి గోల్కొండ కోటకు రాజు అయిన ఘనత మొట్టమొదట వారికే దక్కిందన్నారు.

ఛత్రపతి శివాజీ లాగా మన తెలంగాణలో మొగలాయులకు ఎదురు తిరిగిన వీరుడు పాపన్న గౌడ్, ఐనప్పటికీ చరిత్రలో వారికి అంతటి గుర్తింపు రాకపోవడం బాధాకరం అని అన్నారు. ఇలాంటి మహనీయుని ఘనతను భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు. అలాంటి మహా వీరుడి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం చాలా గర్వంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో స్కైలాబ్ నాయక్, శేఖర్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, చౌగాని వెంకన్న, మహేష్, కాకునూరి బసవయ్య గౌడ్, పోలగాని వెంకటేష్, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు