వాన నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు, తప్పిన ప్రమాదం – latest news

వాన నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు,

తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్, మనసాక్షి : మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా స్కూల్ బస్సు వర్షం నీటిలో చిక్కుకుంది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్ నగర్ మండలం కోడూరు సమీపంలో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా వర్షం నీరు చేరింది. కాగా ఓ ప్రైవేట్ బస్సు సమీప గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని శుక్రవారం ఉదయం బయలుదేరింది.

ALSO READ BREAKING : ఎడతెరిపి లేని వర్షంతో.. నల్గొండలో విషాదం, గోడ కూలి తల్లి కూతుళ్లు మృతి

స్కూల్ బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా వర్షం నీటిలో బస్సు నిలిచిపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సమీపంలో ఉన్న స్థానికులు విద్యార్థులకు ప్రమాదం జరగకుండా సురక్షితంగా కాపాడారు. బస్సు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే వరదలో నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.