TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లావిద్య

MBBS : పేదింటి గిరిజన బిడ్డకు ఎంబిబిఎస్ లో సీటు..!

MBBS : పేదింటి గిరిజన బిడ్డకు ఎంబిబిఎస్ లో సీటు..!

వెల్దండ, మన సాక్షి :

ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపించింది గిరిజన విద్యార్థిని. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అల్లం తోటబావితండా గ్రామపంచాయతీ పరిధిలోని కళ్యాణవాగు తండా కు చెందిన పేదింటి గిరిజన విద్యార్థినికి ఎంబిబిఎస్ లో సీటు దక్కింది.

బాణావత్ లావణ్య వైద్య విద్యలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ పరీక్షల ఫలితాలలో 392 మార్కులు సాధించింది. దాంతో లావణ్య కు సిద్దిపేట జిల్లా ఆర్.వి.ఎం మెడికల్ కళాశాలలో సీటు కేటాయిస్తూ కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

కల్యాణ వాగు తండా కు చెందిన శంకర్ నాయక్, శారద దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి లావణ్య కూతురుతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. లావణ్య చిన్నప్పటి నుంచే చదువులో రాణించేది.

లావణ్య తుర్కయాంజల్ లోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ లో విద్య అభ్యసించారు. నీట్ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించటంతో ఎంబిబిఎస్ లో సీటు లభించింది. దాంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : యూరియా కోసం తొక్కిసలాటలో మహిళ మృతి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!

  3. Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

  4. Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో బతుకమ్మ ఉత్సవాలు..!

మరిన్ని వార్తలు