Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!
Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!
మన సాక్షి, హైదరాబాద్ :
మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కండ్లకోయ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల మహిళ హాస్టల్ లో బాత్రూంలో రహస్య కెమెరాలు ఉన్న విషయం కలకలం రేపింది. దాంతో గురువారం కళాశాల వద్ద భారీగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు ఈ విషయంపై విచారణ చేపడుతున్నారు.
క్యాంపస్ లో తమకు భద్రత లేదంటూ విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. నిజానిజాలను తేల్చేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా హాస్టల్ వార్డెన్, మిస్ ఇన్చార్జిలను వెంటనే సస్పెండ్ చేసింది.
అయినా కూడా కళాశాలలో సీసీ కెమెరాలు పై బయట వ్యక్తులు విచారణ చేస్తే నిజా నిజాలు తేలుతాయని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు హాస్టల్ వార్డెన్ తో పాటు క్యాంటీన్ సంబంధించిన మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏసిపి శ్రీనివాస్ రెడ్డి హాస్టల్ సందర్శించి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ రమణి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. కళాశాలలో జరిగిన సంఘటనను సుమోటాగా తీసుకొని విచారణ చేపడుతున్నట్లు పద్మజ తెలిపారు. మహిళా కమిషన్ చైర్మన్ లేకపోవడం వల్ల ఆమె తరపున కళాశాలలో విచారణ చేసినట్లు తెలియజేశారు. కళాశాలకు నోటీసు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
MOST READ :









