Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం.. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు అత్యాచారం, హత్య..!
Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం.. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు అత్యాచారం, హత్య..!
దామరచర్ల, మన సాక్షి :
ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో చోటుచేసుకుంది. హత్య కేసును దామరచర్ల మండలం వాడపల్లి పోలీసులు ఛేదించారు. ఈ విషయంపై మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు బుధవారం మీడియాకు వివరించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండల పరిధిలోని పుట్టలగడ్డ తండాలో ఈనెల సెప్టెంబర్ 14న అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకోగా ఈ కేసును వాడపల్లి పోలీసులు ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో చేదించారు.
ఈ కేసు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి రాజశేఖర్ రాజు పత్రిక సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు.
పుట్టలగడ్డ గ్రామానికి చెందిన నాగు మౌనిక అనే యువతి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఈనెల 14వ తారీకు రాత్రి 7 గంటలకు నాగు స్వస్థలం పుట్టల గడ్డ గ్రామానికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది.
వివాహం ఇష్టం లేని నాగు తన బావ మరియు క్రాంతి అనే యువకుడు నాగు తల్లి బుజ్జి ల సహాయంతో మౌనికను మాట్లాడాలని ఊరి చివర వ్యవసాయ భూముల దగ్గర తీసుకెళ్లారు.ముగ్గురు కలిసి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు యువతీ మెడలోని చున్నీ తో చెట్టుకు వేలాడదీశారని తెలిపారు.
వీరి ముగ్గురితో పాటు ఈ హత్యకు ఇంకా ఐదుగురు సహకరించరాని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు వాడపల్లి పోలీసులను డిఎస్పి అభినందించారు.
క్లిక్ చేసి ఇవి కూడా చదవండి :
-
Nalgonda : జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే ముమ్మడి సెలవులంటూ హెచ్చరిక..!
-
Cm Revanth Reddy : విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్ గ్యారంటీ కోర్సు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
RunaMafi : రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. వారికి మాత్రమే 4వ విడత మాఫీకి కసరత్తు..!
-
NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!









