Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!

Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!
నల్లగొండ, మన సాక్షి,
మత్తు పదార్థాలు ( టాబ్లెట్స్) సేవిస్తున్న అమ్ముతున్న 17 మందిపై ఎన్డిఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
మహమ్మద్ జబీఉల్లా, హఫీజ్ ఆర్. పి రోడ్డు, రహమాన్ బాఘ్ కాలనీ, నల్గొండ. దారం కృష్ణ తొర్రూర్, మహబూబాబాద్ జిల్లా.వీరితో పాటు స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తున్న (15) మందిని గుర్తించి అందులో (5) వ్యక్తులను అరెస్టు చేయడం జరిగినదని తెలిపారు. ఇక నుండి మత్తు పదార్ధాలు సేవించే వారిపై కేవలం కౌన్సెలింగే కాకుండా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందనీ హెచ్చరించారు.
ఈనెల 20వ తేదీమధ్యాహ్నం సమయంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది నల్గొండ 1 టౌన్ పోలీసులు సంయుక్తంగా, నమ్మదగిన సమాచారం మేరకు, మునుగోడ్ రోడ్ లో ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, పోలీసులను గమనించి మత్తు పదార్ధాలు (స్పాస్మో టాబ్లెట్స్) తీసుకొని ఒక మోటర్ సైకిల్ పై పారిపోతున్నాడు.
మహమ్మద్ జబీయుల్లా వెంబడించి పట్టుబడి చేసి విచారించగా, తనకు వివాహమై ఒక్క పాప, పంజేష ఏరియాలో ఉంటూ, ఫ్రీజ్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటూ (5) సంవత్సరాలుగా, మత్తు పదార్ధాలకు బానిసై, వాటిని తీసుకోవడం ద్వారా ఒక్క రకమైన (మత్తు) కిక్కు వస్తుందని, తక్కువ ధరలో (స్పాస్మో టాబ్లెట్స్) కొనుగోలు చేయవచ్చు అని అలవాటు చేసుకున్నాడు.
గత ఫిబ్రవరి 2024 లో కూడా తనపై రెండు కేసులు అయి జైలుకు వెళ్ళి రావడం జరిగినదనీ తరువాత తిరుమలగిరి దగ్గర ఒక మిల్లులో పని చేస్తూ, కష్టం చేయలేక 3 నెలల క్రితం మళ్ళీ టాబ్లెట్స్ గురించి వాకబు చేస్తూ, నల్గొండ లో పొలీసులు టైట్ చేస్తున్నారని అవి ఇక్కడ దొరకకపోవడంతో మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు లోని వెంకటరమణ మెడికల్ స్టోర్ నిర్వహకుడు అయిన దారం కృష్ణ సాయి వీటి గురించి అడిగి, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఒక్క షీట్ (8-టాబ్లెట్స్) 100/- రూపాయల చొప్పున కొనుగోలు చేసి నల్గొండ టౌన్ లో టాబ్లెట్స్ సేవిస్తున్న వారికి ఆదిక రేటు ఒక్క షీట్ 200/- రూపాయలకు అమ్మి లాభం గడించవచ్చు అని పధకం వేసి అతని దగ్గరికి బైక్ పై వెళ్తూ దాదాపు 10 సార్లు కొనుగోలు చేసి నల్గొండ లో టాబ్లెట్స్ సేవించే వారికి అమ్ముతున్నాడని తెలిపారు.
అందులో భాగంగా ఈనెల 19. న తన బైక్ పై తొర్రూరు లోని వెంకటరమణ మెడికల్ స్టోర్ వెళ్ళి అతని వద్ద సుమారు (08) బాక్సులు (ఒక్క బాక్స్ లో 18 షీట్లు) కొనుగోలు చేసి నల్గొండ లోని మునుగోడ్ రోడ్ లో టాబ్లెట్స్ వేసుకొనే అతడి స్నేహితులు అయిన ఆఫ్రోజ్, అహ్మెద్ అబ్దుల్ హఫీజ్ @ ఖాజీమ్, ఓవైజ్, జావీద్ మరియు ఫెరోజ్ ఒక్కొకరికి ఒక్క షీట్ టాబ్లెట్స్ అమ్మి, మిగిలిన వాటిని నల్గొండ అమ్ముటకు తిరిగి బైక్ పై వస్తుండగా పట్టుబడి చేయగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.
మొదటి వ్యక్తి పట్టుబడి అనంతరం, అట్టి ఒప్పుకోలు ప్రకారముగా, తొర్రూరు పట్టణము లోని వెంకటరమణ మెడికల్ స్టోర్ కు వెళ్ళి అక్కడ దారం కృష్ణ సాయి ను పట్టుబడి చేయగా, అతని సొంత ఊరు తొర్రూరు అని, డి ఫార్మసీ మద్యలో ఆపేసి తన నాన్న పేరు మీద ఉన్న వెంకట రమణ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
వ్యాపారంలో బాగా నష్టం రావడంతో మత్తు పదార్ధాలు (డ్రగ్స్) అయిన టాబ్లెట్స్ మరియు ట్ర మోడల్ టాబ్లెట్స్ ను సేవించడం ద్వారా మత్తుకు గురై యువకులు కిక్కు పొందుతారని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే అధికముగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆలోచించి, అవసరం ఉన్న వారికి 88/- రూపాయలు ఉన్న ఒక్క షీట్ 100/- రూపాయలకు ఎక్కువ రేటుకు అమ్ముతు లాభాలు సంపాదించేవాడు.
మూడు నెలల క్రితం నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ జబీఉల్లా కావాలని అడగగా (10) సార్లు ఎక్కువ మొత్తంలో టాబ్లెట్స్ అమ్మి ఎలాంటి బిల్ లేకుండా ఇచ్చేవాడిని అని ఒప్పుకోగా అట్టి వెంకటరమణ మెడికల్ షాప్ ను డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆద్వర్యంలో షాప్ రైడ్ చేసి దొరికిన టాబ్లెట్స్, రికార్డ్స్, షాప్ డాక్యుమెంట్ లను స్వాదీనము చేసుకొని షాప్ ను సీజ్ చేసి అరెస్టు చేయడం జరిగినట్లు తెలిపారు.
MOST READ :
-
Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..!
-
Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!
-
Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!
-
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!









