TG News : మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు.. ఈసారి కేటీఆర్ పైన..!

TG News : మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు.. ఈసారి కేటీఆర్ పైన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి నన్ను పంపించినా మీ కళ్ళు చల్లబడలేదా అంటూ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వాటిలో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గత పదేళ్లలో ఎప్పుడు నా భర్త పేరు వినపడలేదని, ఇప్పుడు నా భర్త పై ఆరోపణలు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మందిని బెదిరించి డబ్బులు తెచ్చుకున్నారని, నాపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని, వారి బెదిరింపులకు భయపడేది లేదని పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డి, మాధవరం క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలోనే పరిశ్రమ భూమిని చేంజ్ ఆఫ్ లాండ్ జీవోలపై కేటీఆర్ సంతకం పెట్టారని, ఇప్పుడు హిల్ట్ పాలసీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అగ్నికి ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ అన్నారు. నాకు కూడా టైం వస్తుంది.. నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని, నేను సీఎం అయ్యాక 2014 నుంచి జరిగిన అవినీతిపై విచారణ చేపడుతానన్నారు.
ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్ రెడ్డి అవినీతిపై విచారణ చేస్తానని, అరెస్టులు ఉంటాయని పేర్కొని ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని అన్నారు. పదేళ్లలో నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని కవిత పేర్కొన్నారు. మీ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.









