District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో :
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాలలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గత రెండు నెలలుగా వివిధ కారణాలచే విధులకు హాజరు కావడం లేదు. అయితే విషయం తెలుసుకున్న ఆమె వారి సర్వీసింగ్ బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా జిల్లా కలెక్టర్ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులు తిరిగి వీధిలోకి చేరేందుకు జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చారు. కాగా గైరాజరైన రెండు నెలల కాలానికి సంబంధించి సర్వీస్ బ్రేక్ చేస్తూ.. వారికి వేరు వేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ విషయంలో కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.
MOST READ ;
-
Nalgonda : వ్యవసాయ యోగ్యం కానీ భూముల పరిశీలన పక్కాగా చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!













