District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఏఈఓ సస్పెండ్, ఏవో మరో ఏఈఓ కు షోకాజ్..!
District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఏఈఓ సస్పెండ్, ఏవో మరో ఏఈఓ కు షోకాజ్..!
నల్లగొండ, మన సాక్షి
నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యవసాయ విస్తరణ అధికారి సస్పెండ్ ఇదే కారణంపై ఒక మండల వ్యవసాయ అధికారి మరో వ్యవసాయ విస్తరణాధికారికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను గుర్రంపోడు మండలం, కొప్పోలు క్లస్టర్ గ్రేడ్ -2 వ్యవసాయ విస్తరణ అధికారి ఆర్. రామాంజనేయులును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు.
శుక్రవారం ఆమె గుర్రంపోడు మండలం ,కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని వహించినందుకుగాను వ్యవసాయ విస్తరణ అధికారిని ఆమె సస్పెండ్ చేశారు .
అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి కే. మాధవరెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేశారు .అంతేకాక ఇదే కారణం పై చింతపల్లి అవుట్ సోర్సింగ్ వ్యవసాయ విస్తరణ అధికారి కే. మౌనికకు సోకాజ్ నోటీసులను జారీ చేశారు.
MOST READ :
-
TG News : ఇది ట్రయల్ మాత్రమే.. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర, సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!
-
Miryalaguda : జిల్లా స్థాయి షాట్ పుట్ లో సెయింట్ జాన్స్ విద్యార్థినికి ప్రథమ స్థానం..!
-
TG News : తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం..!
-
Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)









