Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda: నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సంచలన నిర్ణయం.. ఎంపిడిఓ, కార్యదర్శుల సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోకుంటే..!

Nalgonda: నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సంచలన నిర్ణయం.. ఎంపిడిఓ, కార్యదర్శుల సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోకుంటే..!

నకిరేకల్, మనసాక్షి

నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడంతో వారిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు బుధవారం నిరసనలు తెలిపి వినతి పత్రాలు అందజేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే వారిని విధుల్లోకి తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా సామూహిక సెలవుల్లోకి వెళ్లి పోతామని హెచ్చరికలు జారీచేశారు.

సస్పెన్షన్ కు గురైన గుర్రంపోడ్ ఎంపీడీఓ ను, ఇద్దరు పంచాయితీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే తాము సామూహిక సెలవులు పెడుతామని నకిరేకల్ మండల పంచాయితీ కార్యదర్శులు సంబంధిత మండలం ఉన్నత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వకుండా ఆర్ధిక భారాన్ని మోపే విధులను కేటాయిస్తూ తమను మనోవేదన కు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లోపంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జె రేణుక,వి జగన్ మోహన్, జె రఘు, సరస్వతి, సూర ప్రకాష్ రెడ్డి, సుజాత, శ్వేత, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : 

మరిన్ని వార్తలు