Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!

నల్లగొండ, మన సాక్షి:

విదుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, వంట చేసే నాలుగవ తరగతి ఉద్యోగులకు నాణ్యమైన భోజనం తయారీ పట్ల సరైన సూచనలు ఇవ్వకపోవడం వల్ల దేవరకొండ మండలం, కమలాపూర్ (ముదిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

చెందిన 32 మంది విద్యార్థినిలు ఈనెల 14న అనారోగ్యానికి కారణమైన కమలాపూర్ (ముదిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు ) ఏ. వేదాద్రిని తక్షణమే విధులనుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ఈ మేరకు మంగళవారం ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ… దేవరకొండ మండలం, కమలాపూర్ (ముదిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ విధులకు హాజరు కావడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, నాణ్యమైన భోజనం తయారు చేసే విషయంలో నాలుగో తరగతి ఉద్యోగులకు సరైన సూచనలు ఇవ్వకపోవడం పట్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆధారాలను బట్టి నిర్ధారణకు రావడం జరిగిందనితెలిపారు.

అందువల్ల పాఠశాల హెడ్మాస్టర్ (పూర్తి అదన బాధ్యతలు) ఏ. వేదాద్రిని సి సి ఏ రూల్స్ ప్రకారం తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, అంతేకాక క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.

MOST READ : 

  1. PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!

  2. Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!

  3. Nalgonda : ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న 45 మంది విద్యార్థులు..!

  4. Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు