Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ నిధులు దుర్వినియోగం, కార్యదర్శి సస్పెండ్..!

గ్రామ పంచాయతీ నిధులు పన్ను దుర్వినియోగం చేసినందుకు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కే. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ నిధులు దుర్వినియోగం, కార్యదర్శి సస్పెండ్..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి,

గ్రామ పంచాయతీ నిధులు పన్ను దుర్వినియోగం చేసినందుకు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కే. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట గ్రామంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 6 లక్షల 31 వేల 57 రూపాయల ఇంటి పన్ను వసూలు చేసి కేవలం 3 లక్షల 87 వేల 382 రూపాయలు మాత్రమే ఎస్.టి.ఓ లో దాఖలు చేశారని , మిగిలిన 2 లక్షల 43 వేల 675 రూపాయలు దుర్వినియోగం చేశారని కలెక్టర్ తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాస్ పై నవంబర్ 6న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో విచారణ నిర్వహించగా 10 రోజులలో పెండింగ్ ఇంటి పన్ను చెల్లిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ అంశంపై సుల్తానాబాద్ మండల పంచాయతీ అధికారి విచారణ నిర్వహించగా మల్టీ పర్పస్ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం 2 లక్షల 56 వేల 500 రూపాయలు వసూలు చేసి 2 లక్షల 18 వేలు మాత్రమే చెల్లించారని , ఇక్కడ మరో 38 వేల 500 రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించామని అన్నారు.

పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాస ఇంటి పన్ను డబ్బులు 2 లక్షల 43 వేల 675 రూపాయలు, మల్టీ పర్పస్ వర్కర్ల జీతాలలో 38 వేల 500 రూపాయలు, టి-ఎస్ బీ పాస్ ఖాతా నుంచి మరో లక్ష 35 వేల రూపాయలు దాన్ని తిరస్కరించి మొత్తం 4 లక్షల 17 వేల 175 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు తేలిందని కలెక్టర్ పేర్కొన్నారు.

4 లక్షల 17 వేల 175 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేస్తూ, విచారణ ముగిసే వరకు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

MOST READ 

  1. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

  2. గ్రామ పంచాయతీలకు రానున్న మహర్దశ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

  3. AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

  4. Nalgonda : జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ..!

మరిన్ని వార్తలు