Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. డీసీఎం ఢీకొన్న బస్సు..!

తెలంగాణలో సంక్రాంతి పండుగ తీవ్ర విషాదం నెలకొన్నది. కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.

సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. డీసీఎం ఢీకొన్న బస్సు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో సంక్రాంతి పండుగ తీవ్ర విషాదం నెలకొన్నది. కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల వద్ద మాచారం సమీపంలో ముందుగా వెళ్తున్న డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం పలువురిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

  1. Sub Collector : పిహెచ్సి సబ్ సెంటర్లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

  2. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!

  4. Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!

మరిన్ని వార్తలు