జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణరంగారెడ్డి

RDO : మాకు దారి చూపండి.. ఓడీఎఫ్ ఉద్యోగులు ఆవేదన..!

RDO : మాకు దారి చూపండి.. ఓడీఎఫ్ ఉద్యోగులు ఆవేదన..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

మాకు “దారి” చూపండి మహా ప్రభు అంటూ ఓడిఎఫ్ (ఫ్యాక్టరీ)ఉద్యోగులు చేవెళ్ల డివిజన్ అధికారి చంద్రకళ కు విన్నపించుకున్నారు. తమ ప్లాట్లకు వెళ్లే రోడ్డును ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్లు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టారని ఓడీఫ్ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు వెళ్లేందుకు దారి చూపించాలని కోరుతూ సోమవారం చేవెళ్ల ఆర్డీవో చంద్రకళకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉద్యోగులంతా కలిసి 1990 లో శంకర్‌పల్లి పరిధి సింగాపురంలోని సర్వే నెం. 51 లో శంకర్ పల్లి– ఓడీఎఫ్ రోడ్డుకు రెండో బిట్ అయిన 3 ఎకరాల 8.5 గుంటల భూమిని కె. మాణిక్యమ్మ వద్ద కొనుగోలు చేశామని చెప్పారు. 1992 లో గ్రామ పంచాయతీ అనుమతితో బాలాజీ ఓడీఎఫ్ కాలనీ పేరుతో 58 ప్లాట్లుగా లే-అవుట్ చేశామని, దీనికి 1983లోనే జీపీ అనుమతి పొందిన 52 సర్వే నెంబర్(8.39 ఎకరాలు) నుంచి 30 ఫీట్ల రోడ్డు ఉందని తెలిపారు.

దాదాపు 35 ఏండ్లుగా ఎలాంటి సమస్య రాలేదని, గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వే నెంబర్లలోని ప్లాట్లకు ఎల్ ఆర్ఎస్ కూడా చేయించుకున్నామని వెల్లడించారు. కానీ, ఇటీవల తమ ప్లాట్ల పక్కన వెంచర్ చేసిన ‘సిల్ప లాచగారి గ్రాండూర్’ రియల్ ఎస్టేట్ సంస్థ రోడ్డును కబ్జా చేసి ప్రహరీ నిర్మించిందని ఆరోపించారు.

ప్రస్తుతం తమలో చాలా మంది రిటైర్డ్ అయ్యారని, ఇల్లు కట్టుకుందామంటే దారి లేకుండా పోయిందని వాపోయారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సమస్య తీరలేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

స్పందించిన ఆర్డీవో వెంటనే ఫీల్డ్ విజిట్ చేసి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఓడీఎఫ్ కాలనీ ప్రెసిడెంట్ ఎంఈవీ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, సెక్రటరీ అర్జున్, జాయింట్ సెక్రటరీ సురేష్, ట్రెజరర్ ప్రతాప్ రాజు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  4. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

  5. Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!

  6. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

మరిన్ని వార్తలు