ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్..!
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ ఎస్ ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కేసు నమోదైన విషయంలో ఆ స్టేషన్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
వివరాల ప్రకారం.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఎస్సై పవన్ కానిస్టేబుల్ సంతోష్, రామకృష్ణ లు లంచం డిమాండ్ చేశారు. కాగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దాంతో పథకం ప్రకారం బాధితుడు నుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్సై పవన్, కానిస్టేబుల్స్ సంతోష్, రామకృష్ణ లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచి విచారణ కొనసాగిస్తున్నారు.
MOST READ :









