అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!
అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అక్కా.. అర్జెంటు ఫోన్ చేసుకోవాలి.. అన్నా ఒక్క ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్లో చార్జింగ్ లేదు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అంటూ ఇలాంటి సంఘటనలు అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. ఆపదలో ఉన్నారని, అయ్యో పాపం సాటి మనిషికి సహాయం చేయాలని ఫోన్ ఇచ్చారు అనుకో అంతే సంగతి.
మన ఫోన్ ఇతరుల చేతికి ఇస్తే సైబర్ నేరగాళ్లు దోచేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇతడు ఓ టైప్ దొంగ. పాపం అని ఫోన్ ఇస్తే పేదింటి ఆడ కూతురుది ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన పాడేరు ఏజెన్సీ వద్ద పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది.
ఆడ కూతురు పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. అక్క అర్జెంటు ఫోన్ ఇస్తే మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి మళ్ళీ వెంటనే ఇస్తా అని అడిగాడు. పాపం అని ఫోన్ ఇచ్చింది . అయితే ఫోన్ మాట్లాడినట్లు తెగ యాక్షన్ చేశాడు. ఆమె బంకులో పెట్రోల్ పోస్తుండగా గమనించి దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడినట్టు నటించి ఫోన్ తో చెక్కేశాడు.
అక్కా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు.. ఒకసారి ఫోన్ ఇస్తే మాట్లాడిస్తా అంటూ నమ్మించి ఫోన్ కొట్టేశాడు. పాపం ఆ పేద మహిళ ఈ అమ్మాయి ద్వారా ఫోన్ కొనుక్కున్నది ఈ ఫోటో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దొంగ దొరుకుతాడు లే అక్క ఎక్కడికి పోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ALSO READ :
మిర్యాలగూడ : ఏకంగా లారీనే దాచేశాడు.. ఆ ఘనుడు..!
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..!
రాఖీ పండగ నింపిన విషాదం.. జోగిపేటలో డివైడర్ స్థంబాన్ని డికొట్టిన కారు..!









