అంగరంగ వైభవంగా నల్లవెల్లి బొగ్గుల గుట్ట సీతారామచంద్రస్వామి రథోత్సవం..!
కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడు భక్తుల గుండెల్లో కొలువై శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామం గ్రామంలో ని బొగ్గుల గుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా వేలాదిమంది భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో యువకులు ఎంతో ఉత్సాహంగా రథాన్ని లాగారు.

అంగరంగ వైభవంగా నల్లవెల్లి బొగ్గుల గుట్ట సీతారామచంద్రస్వామి రథోత్సవం..!
చింతపల్లి, మన సాక్షి :
కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడు భక్తుల గుండెల్లో కొలువై శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామం గ్రామంలో ని బొగ్గుల గుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా వేలాదిమంది భక్తుల నడుమ భక్తిశ్రద్ధలతో యువకులు ఎంతో ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల ముఖ్య నాయకులు హాజరై గుట్టపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ గత 300 సంవత్సరాల క్రితం బొగ్గుల గుట్టపై నెలకొని ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం దాతల సహకారంతో దిన దినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా స్వామివారి శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తూ నేడు రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేలాది మంది భక్తులు నడుమ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ స్వామి వారి రథాన్ని భక్తులు లాగారు.
ఈ రదోత్సవానికి కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా నల్లగొండ జిల్లా ల నుండి కాకుండా జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని కనులారా విందంగా వాతాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ నిర్వాహకులు దాతలకు, వివిధ పార్టీల ముఖ్య నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు గుట్టపై తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలోభక్తులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









