క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Check Post : కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టుల ఏర్పాటు..!

Check Post : కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టుల ఏర్పాటు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రాబోయే రబీ సీజన్లో వరి కొనుగోళ్లలో పోరుగు రాష్ట్రం కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రానికి వరి ధాన్యం రాకుండా నివారించేందుకు నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 06 బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామనీ డి.ఎస్.పి. నల్లపు లింగయ్య తెలిపారు.
అవి జలాల్పూర్ చెక్ పోస్ట్, కాన్ కుర్తి చెక్ పోస్ట్, చేగుంట చెక్పోస్ట్, కృష్ణ బ్రిడ్జి చెక్ పోస్ట్, సమస్తాపూర్ చెక్ పోస్ట్, ఉజ్జెల్లి చెక్పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

ఈ బోర్డర్ చెక్పోస్ట్ లో పోలీస్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులు ఉండి పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుండి వరి ధాన్యం రాకుండా చూడాలని, వాహనాల వే బిల్లులను తనిఖీ చేయాలని సూచించారు. చెక్పోస్ట్ దగ్గర వచ్చి పోయే ప్రతి ఒక్క వాహనాల నంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.

వ్యాపారస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్పోస్టుల వద్దనే కాకుండా బోర్డర్ గ్రామాల నుండి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ లు నిరంతరం చెక్ పోస్ట్ ల పై నిఘా ఉంచాలని చెక్ పోస్ట్ లో వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు రెవెన్యూ అధికారులను నిరంతరం తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని తెలిపారు.

MOST READ : 

  1. District collector : భూ భారతిలో సమస్య పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దరఖాస్తు.. జిల్లా కలెక్టర్..!

  2. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  3. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!

మరిన్ని వార్తలు