టమాటాల చోరీ కేసులో రైతుపై దాడికి సంఘీభావం.. స్వచ్ఛంద బంద్ విజయవంతం..!
టమాటాల చోరీ కేసులో రైతుపై దాడికి సంఘీభావం.. స్వచ్ఛంద బంద్ విజయవంతం..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో టమోటాలు చోరీ విషయమై రైతుపై దళితులు దాడి చేసి తీవ్రంగా కొట్టిన సంఘటనను నిరసిస్తూ మండల కేంద్రంలో దుకాణాదారులు సోమవారం స్వచ్ఛంద బంద్ నిర్వహించారు . ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలో ని దిగువ హరిజనవాడ కు చెందిన గోవిందు బి.కుర్రప్పలే కు చెందిన ఓ రైతు పొలంలో శనివారం రాత్రి టమోటా లు చోరీ చేస్తుండగా ఈ విషయాన్ని బలిజ వీధికి చెందిన ఆదినారాయణ రెడ్డి పొలం యజమానికి చెప్పాడు.
ఈ విషయమై గోవిందు తనతో పాటు హరిజనవాడ కు చెందిన మరికొంత మందితో ఆదినారాయణ రెడ్డి పై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన వారిపై పోలీసు లు కేసు నమోదు చేశారు.అయితే ఓ రైతు పండించిన పంటను అక్రమంగా చోరీ చేయడమే కాకుండా ఆదినారాయణ రెడ్డి పై దాడి చేయడం అమానుషం అని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మానవతా దృక్పథంతో సోమవారం స్వచ్ఛంద గా బంద్ పాటించినట్లు దుకాణాదారులు తెలిపారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదినారాయణ రెడ్డి, గ్రామస్తులు పోలీసులను డిమాండ్ చేసారు. ఈ విషయమై మదనపల్లె సి ఐ రమేష్ రామసముద్రం చేరుకొని ఇరువర్గాల తో చర్చించారు.కేసును లోతుగా అధ్యయనం చేసి నిందితుల పై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.మండల చరిత్రలో ఓ రైతుకు బాసటగా నిలిచి న్యాయం గెలవాలని దుకాణాదారులు, మండలం లోని పలు గ్రామాల రైతులు స్వచ్ఛంద గా పోరాటం చేయడం మండలం లో చర్చనీయాంశంగా మారింది.
MOST READ :









