Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!

పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు.

TG News : మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. వారు BRS లోనే ఉన్నారు..!

మన సాక్షి, హైదరాబాద్ :

పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. గురువారం పార్టీ మారారనే ఆరోపణలపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ చేపట్టారు. వారు పార్టీ మారారనే ఆధారాలు లేవన్నారు.

ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో ఇద్దరికి కూడా గురువారం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై అనర్హత విచారణ పూర్తికాగా తీర్పు రిజర్వులో ఉంది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. సుప్రీంకోర్టులో విచారణకు ముందే స్పీకర్ తీర్పు వెల్లడించారు.

MOST READ 

  1. ప్రేమ పెళ్లి పై సుప్రీంకోర్టు జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!

  2. Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!

  3. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

  4. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..!

మరిన్ని వార్తలు