తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : క్రీడాకారులు.. జిల్లాకు మంచి పేరు తేవాలి.. కలెక్టర్..!

Nalgonda : క్రీడాకారులు.. జిల్లాకు మంచి పేరు తేవాలి.. కలెక్టర్..!

నల్లగొండ, మనసాక్షి :

సీఎం కప్ క్రీడా పోటీలలో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈనెల 16 నుండి 21 వరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.  అంతేకాక సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభ సూచకంగా క్రీడా పథకాన్ని ఎగురవేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించే విధంగా శిక్షణ ఇవ్వడమే సీఎం కప్ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. అందువల్ల క్రీడాకారులు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు