తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

Chinthapalli : శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ మాత జాతర ఉత్సవాలు.. ఎప్పటినుంచంటే..!

Chinthapalli : శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ మాత జాతర ఉత్సవాలు.. ఎప్పటినుంచంటే..!

చింతపల్లి, మనసాక్షి :

కోరిన కోరికలు తీర్చే దైవంగా చింతపల్లి మండల కేంద్రానికి హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి పక్కన గత 40 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ మాత జాతర ఉత్సవాలు ఈనెల 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు గండికోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.

గతంలో చిన్న గుడి నిర్మితమై ఉండగా దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ గత 22 సంవత్సరాల క్రితం గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. ఆనాటి నుండి నేటి వరకు అప్పటి ఆలయ పూజారి ఈ దేవాలయ పీఠాధిపతులు దున్నఇద్దయ, కురుమిద్ద జంగయ్య, పర్వతానంద స్వామి,గండికోట బాలయ్య, రాములు ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టారు.

ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి బ్రహ్మోత్సవాలను జాతర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రస్తుత ఆలయ నిర్వాహకులు గండికోట చంద్రశేఖర్ జాతర మహోత్సవానికి ఆలయ ప్రాంగణంలో సకల సౌకర్యాలను సమకూరుస్తున్నారు.

మండల కేంద్రానికి సమీపంలో అమ్మవారి ఆలయం ఉండడంతో ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు వివిధ గ్రామాల నుండి విచ్చేసి తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తే అమ్మవారి వద్దనే బండ్లకు పూజలు చేయించుకోవడం జరుగుతుంది.

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి పక్కన అమ్మవారు కొలువై ఉండడంతో భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోనిదే ప్రయాణం చేయరు. మూడు రోజులు జరిగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ జాతర కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు రానున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో నాగుల పుట్ట ఉండడంతో మహిళలు ప్రతి ఆదివారం, శుక్రవారం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుని కొలుస్తున్నారు.ఈ సందర్భంగా 23 ఆదివారం జాతర ప్రారంభోత్సవం.24 సోమవారం బోనాలు ఫలహారం బండ్లు, 25న వనవాసం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు వారు వివరించారు.

వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని తమ మొక్కలు చెల్లించుకోవాలని చంద్రశేఖర్ పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

MOST READ : 

  1. Suryapet : బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షి అంట.. మరి రేవంత్ రెడ్డి జాక్‌పాట్ అంట.. కేటీఆర్ సారూ ఇలా అనబట్టే..!

  2. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  3. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  4. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  5. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు