Velpugonda : నేటి నుంచి వేల్పుగొండలో శ్రీ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు..!
Velpugonda : నేటి నుంచి వేల్పుగొండలో శ్రీ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు..!
టేక్మాల్, మన సాక్షి:
మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలోని కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శ్రీ తుంబురీశ్వర స్వామి ఉత్సవాలు ఈనెల 9వ తేది నుండి 12వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నీ ఆలయ పూజారి వైద్య రవి కోటి వైద్య రామశర్మ తెలిపారు. ఈ
ఉత్సవాలను శ్రీ మదనానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
శ్రీ తుంబురీశ్వర దేవాలయము కాకతీయుల కాలం నుంచే నిర్మితమైనదని ఇచ్చట గల శిలాశాసనాలు క్రీస్తుశకం 11 వ శతాబ్దానికి చెందినవాన్ని ఆలయ శిలా శాసనాలు తెలుపుతున్నాయి దేవ స్ధలము బహిప్రాంగణము పై సంస్కృతిని కనువిందు చేస్తున్నట్టుగా చుట్టు శిల్ప స్తంభాలు, మరోవైపు లక్ష్మి, మరోవైపు మహంకాళి, సరస్వతి దేవి, అద్దం చూస్తూ అలంకరించుకున్నట్లు మరో వైపు స్త్రీ పిల్లలకు పాలిస్తున్నతల్లి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి 09వ తేదీన మాఘ శుద్ధ ద్వాదశి ఆదివారం ఉదయం రుద్రా అభిషేకం, వ్యూహ వచనము కలశ స్థాపన శకట ఉత్సవం సాయంత్రం బండ్లు బోనాలు నిర్వహిస్తారు.
10 తేదీన సోమవారం స్వామివారికి రుద్రాభిషేకము పుష్పార్చన శకట ఉత్సవం పాచీ బండ్లు నిర్వహిస్తారు. 11వ తేదీన బిల్వార్చన రుద్రాభిషేకం పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుండి కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రాత్రి పార్వతి పరమేశ్వర రథోత్సవం జరుగుతుంది 12వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి రోజున పార్వతి పరమేశ్వరులకు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిత్య భజన సంకీర్తనలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమాలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, రంగంపేట పీఠాధిపతులు,శ్రీ శ్రీ శ్రీ పూ”పా” రాజయోగి వెంకటస్వామి ఆత్మనంద ఆశ్రమం రుస్తుం పేట పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆలయ పూజారి శ్రీ రవికోటి వైద్య రామశర్మ ఆలయ కమిటీ భక్త బృందం గ్రామ ప్రజలు పెద్దలు తెలియజేశారు.
MOST READ :









