Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్

Tandel : తండెల్ ఎలా ఉందో తెలుసా..!

Tandel : తండెల్ ఎలా ఉందో తెలుసా..!

మదనపల్లి, మన సాక్షి :

గీతా ఆర్ట్ నిర్మించిన తండేల్ సినిమా ఆకట్టుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు. చందూ మొండేటి దర్శకత్వం మంచి మార్కులు కొట్టేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో హైలెట్ గా నిలచింది. కథ కూడా బాగుంది. మాటలు హత్తుకుంటాయి.

ఎక్కడా బోర్ అన్పించదు. పాటలు కూడా ఎంటర్ టైనర్ గా ఎమోషనల్ గా సాగాయి. మత్స్యకారుల జీవన విధానం వారి కష్ట నష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు నిక్షేపంగా చూడవచ్చు. ఎక్కడా అసభ్య సన్నివేశాలు లేవు. లవ్, యాక్షన్,దేశ భక్తి బావోద్వేగం, వృత్తి ఔన్నత్యం, సెంటిమెంట్, ఎమోషనల్ సినిమా ఇది. ప్రేమికులను కట్టి పడేస్తుంది. ప్రేమికులు ఎంతగానో ఆస్వాదిస్తారు.

లీడర్స్ కావాలనుకునే వారు కూడా చూడాల్సిన సినిమా. నడిపించే నాయకుడు.. లీడర్ అంటే ఎలా ఉండాలో ఇందులో చూపారు. సినిమా హాల్లోకి వెళ్ళడమే మన వంతు.. ఆతర్వాత మనసు మాట వినదు. సినిమాలో లీనమై పోవాల్సిందే. మనసుకు ఇష్టమైన వాడు.. పది మందికి మంచి ఆపై మేలు చేసే మనిషి ఒక్కసారిగా దూరమైతే ఆబాధ వేదన ఎంతటి ప్రభావాన్ని కల్గిస్తుందో, ఎలాంటి పరిస్తితులకు దారి తీస్తుందో కళ్లకు కట్టినట్టు చూపారు.

స్టోరీ ఈ సినిమాకు హైలెట్ గా నిలచింది. మనసును మనిషిని కదిలించే.. సన్నివేశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్లలో కంట తడిపెట్టకుండా ఉండలేరు. నాగ చైతన్య హీరోయిజాన్ని పక్కన పెట్టి నటించారు. ఇది ఆయన సినీ జీవితానికి మైలురాయిగా నిలుస్తుంది. సాయి పల్లవి అద్భుతంగా నటించడమే కాదు పాత్రలో జీవించారని చెప్పకతప్పుదు.

సినిమాలో వీరిద్దరి యాస, బాష కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ప్రతి ఒక్కరూ చూడతగ్గ సినిమా. ఆపై మెచ్చుకోతగ్గది కూడా. అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ అద్భుతంగా ప్రతి సీన్ ను మలిచాడు. తండేల్ అనే ఈ సినిమా పేరు వినడానికి కొంత వింత గా వున్నా ఆ పేరు గొప్పతనం, ఔన్నత్యం సినిమా చూశాక తెలుస్తుంది.

Reporting : Kodanda Reddy

Madanapalle

MOST READ : 

  1. Penpahad : కాలేశ్వరం జలాలు రాక ఎండిన పంట పొలాలు.. పశువుల మేపుతున్న రైతులు..!

  2. Tandel : 24 గంటల్లోనే తండేల్ కొంప మునిగింది.. ఒక్కరోజే ఆనందం..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

  4. Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు