Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
MPDO : బీర్కూర్ నూతన ఎంపీడీవో గా శ్రీనిధి.. ఎవరో తెలుసా..!

MPDO : బీర్కూర్ నూతన ఎంపీడీవో గా శ్రీనిధి.. ఎవరో తెలుసా..!
బీర్కూర్ (మన సాక్షి) :
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల పరిధిలో కొత్త ఎంపీడీవోగా కె. శ్రీనిధి బాధ్యతలు స్వీకరించారు. ఆమె గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మొదటిసారిగా బీర్కూర్ మండలంలోనే తన సేవలను ప్రారంభించడం విశేషం.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హామీ పనులు, హరిత హారం, స్వచ్ఛ భారత్, ఇంద్రమ్మ ఇండ్లు వంటి పథకాల పురోగతిని సమీక్షించారు.
ఆమె మాట్లాడుతూ – “ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ పారదర్శకత, సమర్థత, సేవాభావం కలిగిన పరిపాలన అందించేందుకు కృషి చేస్తాను. బీర్కూర్ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆమెకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ :
-
Suspended : జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలు.. లైంగిక వేధింపుల ఘటనలో ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్..!
-
Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Gold Price : బంగారం ధరలు మరోసారి పతనం.. ఈరోజు తులం ఎంతంటే..!









