Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురియడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఆల్మట్టి డ్యాం నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దాంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు 1,06,070 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం కు లక్ష రెండువేల 14p క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అవుతుంది. 30.85 టీఎంసీల నీరు నిలువ ఉండగా 99,933 క్యూసెక్కుల నీరు ఇంట్లో నమోదయింది.
అదే విధంగా జూరాల ప్రాజెక్టుకు లక్ష 13వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా 12 గేట్లు ఎత్తి 79,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జల విద్యుత్ కేంద్రాల ద్వారా 29,296 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్ల లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,86, 212 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. కాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా జల విద్యుత్ కేంద్రాల ద్వారా 67,740 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండల మారింది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
MOST READ :
-
Miryalaguda : పోలీసులకు జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
-
Covid Vaccine Report : కోవిడ్ వ్యాక్సిన్.. గుండెపోటు మరణాలు.. కమిటీ ఏం తేల్చింది..!
-
Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!
-
TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!









