Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సెయింట్ జాన్స్ సంచలనం..!

Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సెయింట్ జాన్స్ సంచలనం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించారు.

పాఠశాలకు చెందిన జి వెన్నెల 600 మార్కులకు గాను 573 మార్కులు, ఎం శివప్రసాద్ 564 మార్కులు, పి శివకుమార్ 550, మార్కులు డి మాధవి 548, మార్కులు కే దీపిక 547 మార్కులు, కే నవ్య 546 మార్కులు, కే.వైష్ణవి 545 మార్కులు, టి. హర్షిని 545 మార్కులు, కే. శ్రీవిద్య 541 మార్కులు సాధించారు.

అదేవిధంగా 500 మార్కులకు పైగా 38 మంది విద్యార్థులు సాధించారు. పాఠశాల కు చెందిన 66 మంది పరీక్షకు హాజరు కాగా నూరు శాతం ఫలితాలు సాధించారు. కాగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష విద్యార్థులకు స్వీట్స్ తినిపించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూరు శాతం ఫలితాలతో తమ పాఠశాల విద్యార్థులు ఎల్లప్పుడు ముందంజలో ఉంటారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను, క్రమశిక్షణ ను ఎల్లప్పుడూ అందించడమే తమ పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్, శ్రీనివాస్, విజయ్ శంకర్, లోకేష్, నాగరాజు, పరమేశ్వరి, నాగలక్ష్మి, పద్మ, నిర్మల, సుమన్ తదితరులు విద్యార్థులను అభినందించారు.

MOST READ :

  1. Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

  2. Chicken: చికెన్ లేనిదే ముద్ద దిగట్లేదా.. అయితే ఇది తెలుసుకోవల్సిందే..!

  3. District collector : జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!

  5. Palms : ఎండాకాలంలో తాటి ముంజలు తింటే.. శరీరంలో అద్భుతమైన మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు