Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Rythu : నల్గొండ జిల్లా యువ రైతుకు రాష్ట్ర స్థాయి ప్రకృతి రత్న అవార్డు..!

Rythu : నల్గొండ జిల్లా యువ రైతుకు రాష్ట్ర స్థాయి ప్రకృతి రత్న అవార్డు..!

శాలిగౌరారం, మనసాక్షి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం జాలోనిగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చీమల లింగస్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రకృతి రత్న ఉగాది పురస్కారం అందుకున్నారు. గో ఆధారిత సహజ వ్యవసాయం పై ఎన్ టి ఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో నిర్వహించిన సదస్సు లో విజయవాడ పార్లమెంట్ టి డి పి అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మెన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వై. వెంకటేశ్వరరావు చేతుల మీదుగా చీమల లింగస్వామి ప్రకృతి రత్న పురస్కారం అందుకున్నాడు.

ఈ సందర్బంగా అవార్డు గ్రహీత చీమల లింగస్వామి మాట్లాడుతూ ఆవు మూత్రం, పేడ ప్రకృతి లో లభించే వనరుల తో సేద్యం చేస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం పై రైతులకు అవగాహన కలిపిస్తూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపు గా ఈ అవార్డు అందుకున్నట్లు వివరించారు. ఈ సందర్బంగా సోమవారం లింగస్వామిని అతని మిత్రులు పెంబళ్ల శ్రీనివాస్, తాందారి శ్రీకాంత్, నిమ్మల నరేష్, నోముల భగత్, ఆకవరం దామోదరాచారి ఘనంగా శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.

MOST READ :

  1. TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!

  2. Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  4. TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!

  5. TG News : ఉద్యోగార్దులకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది బహుమతి..!

  6. TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

మరిన్ని వార్తలు