Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Tomato : టమాటాలు చోరీ.. వ్యక్తి పై దాడి..!

Tomato : టమాటాలు చోరీ.. వ్యక్తి పై దాడి..!

రామసముద్రం, మనసాక్షి :

కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో టమాటాలు చోరీ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

అన్న మయ్య జిల్లా రామసముద్రం మండలంలో టమోటాలు చోరీ విషయమై వ్యక్తి పై దాడి చేసి తీవ్రంగా కొట్టిన సంఘటన మండలకేంద్రం లో ఆదివారం చోటుచేసుకుంది.

ఎస్సై వివరాల మేరకు మండల కేంద్రంలో ని దిగువ హరిజనవాడ కు చెందిన గోవిందు బి.కుర్రప్పల్లె కు చెందిన ఓ రైతు పొలంలో శనివారం రాత్రి టమోటా లు చోరీ చేస్తుండగా ఈ విషయాన్ని బలిజ వీధికి చెందిన ఆదినారాయణ రెడ్డి పొలం యజమానికి చెప్పాడు.

ఈ విషయమై గోవిందు తనతో పాటు హరిజనవాడ కు చెందిన మరికొంత మందితో ఆదినారాయణ రెడ్డి పై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు