Sarpanch Elections : మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!

Sarpanch Elections : మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!
నల్లగొండ, మన సాక్షి :
జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ పంంచాయితీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం దేవరకొండ నందు సిబ్బందికి ఎన్నికల విధులపై బ్రీపింగ్ కార్యక్రమంలో మాట్లాడారు.
17వ తేదీన మూడో విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి, కొండమల్లేపల్లి, డిండి,చందంపేట, గుడిపల్లి, గుర్రంపోడు, నేరేడుకొమ్ము, పి.ఏ పల్లి, మొత్తం 09 మండలాల్లోని 269 గ్రామ పంచాయితీలలో 2206 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు సంబంధించి ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు ప్రతి మండలానికి సూమరు 200 చొప్పున 2000 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి మండలానికి ఒక డియస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో రూట్ లుగా విభజించి ఎలాంటి సమస్యలు తలెత్తిన తక్షణమే అక్కడికి చేరుకునుని పరిష్కరించుటకు సీఐ,ఎస్.ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, రౌడీ షీటర్లు, ట్రబుల్ మంగార్స్ ను బైండవర్ చేయడం జరిగిందని అన్నారు.
గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, గొడవలు, అల్లర్లు సృష్టించిన ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారి పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఒక్క సారి కేసులు నమోదు అయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు. జిల్లా ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు.
ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమికూడరాదని అన్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులకు, ర్యాలీలకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల విధులలో సిబ్బంది చేయవలసినా, చేయకూడని విధుల గురించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటిస్తూ, పూర్తి నిబద్ధతతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్య తలెత్తినట్లైతే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని, ఏ వ్యక్తికి గాని, పార్టీకి గాని మద్దతు ఇచ్చినట్లు దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
MOST VIEWS
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!
-
TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!
-
TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!
-
LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!
-
Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!










