Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!

Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!

నల్లగొండ, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు ఉన్నారని మాజీ మంత్రి గుంటకల్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం బి ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఎన్నికల కమిషన్ మీద నమ్మకం పోతుందని నామినేషన్ వేసే బిఆరెస్ అభ్యర్థులను బయ బ్రాంతులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని బిఆరెస్ హయాంలో ఎక్కడ రాజకీయ ఘర్షణలకు తావు లేదని అన్నారు.

జిల్లాలో ఇద్దరు మంత్రుల పి ఏ లు రోజు పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారని, అక్రమ పోలీస్ కేసులు బిఆరెస్ కార్యాలర్తలపై పెట్టిస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు.

జిల్లాలో హోమ్ గార్డ్ లు కూడా జిల్లా ఎస్పీ లను లెక్క చేసే పరిస్థితి లేదని, బిఆరెస్ నేతలు గెలిచిన చోట రీ కౌంటింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. చిన్న కాపర్తి లో బిఆరెస్ కు వేసిన ఓట్లు పోలింగ్ చిట్టీలు డ్రైనేజి లలో ఉన్నాయని చెప్పారు. బిఆరెస్ కు గ్రామ స్థాయిలో పటిష్ఠమైన పమహిళలను, రైతులను బిఆరెస్ కు దూరం చేసే కుట్ర లో భాగంగా అమలు కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని బిఆరెస్ పాలన లో సంక్షేమ పథకాలు ప్రపంచం దృష్టిని అక్కర్శించాయని అన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లాగ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కొండూరి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న,.. పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, తిప్పర్తి,

నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు రావుల శ్రీనివాస రెడ్డి, మారగోని గణేష్, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి ఊటుకూరు సందీప్ రెడ్డి,తండు నర్సింహా గౌడ్, కందుల లక్ష్మయ్య, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున,తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!
  2. TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!
  3. BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!
  4. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!

మరిన్ని వార్తలు