తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థులే అక్కడ మంత్రులు, అధికారులు..!

Miryalaguda : విద్యార్థులే అక్కడ మంత్రులు, అధికారులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

విద్యార్థులే అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సోమవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, రాజకీయ నాయకులుగా, మంత్రులుగా 120 మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల పాత్రలు పోషించారు.

వీరిని పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష అభినందించారు. ఉత్తమ పాత్రలు పోషించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి స్వపరిపాలన దినోత్సవం ఉపయోగపడుతుందన్నారు. చదువులతో పాటు విద్యార్థులు రేపటి తరాలకు ఎలా వెళ్లాలని.. విద్యార్థి దశ నుండే అభిరుచులు ఆసక్తులకు తగినట్లుగా తమ పాఠశాలలో విద్యాబోధన ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రిగా వెర్మిల, హోం మంత్రిగా హర్షిని, ఫైనాన్స్ మినిస్టర్ గా అంజలి, ఐటి మంత్రి హర్షిత, విద్యాశాఖ మంత్రి శ్రేష్ట, ఆర్ జెడి మాధవి, సి ఒ.ఎస్ మేధా, కలెక్టర్ గా గౌతమ్ రాజ్, డీ ఈఓ సాకేత్ రెడ్డి, ఎంఈఓ శివకుమార్-, మోక్ష కరస్పాండెంట్, ప్రిన్సిపల్ శివప్రసాద్, డైరెక్టర్ నవ్య వ్యవహరించారు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

  4. Hyderabad : హైదరాబాదులో దారుణం.. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య.. (వీడియో)

మరిన్ని వార్తలు