తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పాఠశాల విద్యార్థులే ఉపాధ్యాయులుగా అధికారులుగా, రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శిష్య పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 115 మంది విద్యార్థులకు పైగా వివిధ రకాలుగా పాత్రలు పోషించి వ్యవహరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు బయటికి తీసేందుకే స్వపరిపాలన దినోత్సవం ఉపయోగపడుతుందన్నారు.

పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ముందంజలో ఉంచుతున్నట్లు తెలిపారు.

Most Read News : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!

  3. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు