Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రబుత్వ ఉద్యోగలు ఇప్పిస్తూనని అమయకులను నమ్మించి సుమారు 17 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన మాదిన్నే కృష్ణ వైస్సార్ కాలనీ, ధర్మవరం గ్రామం, మండలం, అనంతపురం జిల్లా వ్యక్తిగా దేవరకొండ పోలీసులు గుర్తించినారు.
దేవరకొండ ఏఎస్పి మౌనిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…మార్చ్ 1వ తేదీన దేవరకొండ పట్టణంలో బి ఎన్ ఆర్ కాలనీ కి చెందిన ముడావత్ స్వాతి, ముడావత్ రమేశ్ మరియు షేక్ సైదా బేగమ్, షేక్ తబ్రెజ్ లను ఒక వ్యక్తి 2022 లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 17 లక్షల రూపాయలు తీసుకొని ఎటువంటి ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసి అట్టి డబ్బులతో పారిపోయాడని మార్చ్ నెలలో దేవరకొండ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగా అట్టి దరఖాస్తుపై దేవరకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 66/2025 యూ/ఎస్ 420 ఛీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది అన్నారు.
కేసు విచారణలో భాగంగా దేవరకొండ ఏఎస్పీ పి, మౌనిక (ఐపీఎస్ ) ఆధ్వర్యంలో పరిశోదనాధికారి, దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ యం. నర్సింహులు మరియు వారి సిబ్బంది అందరూ టీములగా ఏర్పడి నేరము చేసిన నిందితుడిని చాకచక్యంగా పట్టుకోని అతని వద్ద బాదితులు కోల్పోయిన కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగినది అన్నారు.
అతని భార్య టైలరింగ్ పని చేస్తూ జీవిస్తునారు. టైలరింగ్ పని చేసుకుంటూ వచ్చే డబ్బులు సరిపోక నిందితుడు తనికెళ్ళ గ్రామములొ కొద్ది మందితో కలిసి చిట్టే పాటలు పెట్టి అట్టి డబ్బులు ఖర్చుపెట్టుకొని, అట్టి చిట్టి డబ్బులు కట్టలేక పోయే సరికీ అందరూ ఒత్తిడి తెచ్చేసరికి అక్కడ నుండి పారిపోయి అనంతపురం జిల్లా లో దర్మవరం గ్రామానికి వెళ్ళి అక్కడే 20 సం„రాల వరకు వున్నాడు.
అక్కడ కూడా కొద్ది మందిని మోసం చేసి అక్కడ నుండి 2020-21 సం„ నల్లగొండ జిల్లాలో దేవరకొండ పట్టణానికి వచ్చి బి.ఎన్.ఆర్ కాలనీ లో నాళ్ళ రవి సన్నాఫ్ వీరయ్య అనే వ్యక్తి యొక్క ఇంట్లో కిరాయి కి వున్నాడు అన్నారు. ఆ సమయములోనే ఆ ఇంటి చుట్టుపక్కల వారితో వేణుగోపాల్ రెడ్డి అని పేరు తో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నాననీ ప్రస్తుతం పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెంలో డ్యూటీ చేస్తున్నానని పరిచయం పెంచుకున్నాడు.
అలా 2022 సం, అతను కిరాయికి వుండే ఇంటి పక్కన గల మూడవత్ స్వాతి, ఆమె భర్త ముడావత్ రమేష్ మరియు షేక్ సైదా బేగమ్ మరియు ఆమె కుమారుడు షేక్ తబ్రెజ్ లతో పరిచయం పెంకుకొని వారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ నా రికమండేషన్ పై ఇప్పిస్తాను అని నమ్మించి వారి వద్ద సుమారు 17 లక్షలు దఫాల వారీగా తీసుకున్నాడు.
వారు అడిగినప్పుడల్లా వారికి టైం పడుతది అని చెప్తూ కాలం వెళ్లదీసి బాదితులు ప్రతిరోజు అడుగుటంతో ఇక్కడి నుండి పారిపోయనాడు. ఇట్టి నిందితుని టెక్నికల్ ఎవిడెన్స్ సహాయముతో పరిశోదాణాధికారి పట్టుకోనైనది. నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న దొంగ సొత్తు 8 లక్షలు నగదు మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కేసు చేదించిన పోలీసు సిబ్బంది దేవరకొండ ఎస్సై రువ్వ కొటేశ్, కాటి సతీష్ కానిస్టేబుల్, జీ. రాజారాం, రైటర్, బూర అంజి కానిస్టేబుల్, టి. వెంకన్న, కానిస్టేబుల్, ఎస్ కే, చాంద్ పాషా, కానిస్టేబుల్, వి. సింహాద్రి, హోంగార్డ్, జి. యాదయ్య, అసిస్టెంట్ రైటర్, సోమ్లా, హోంగార్డ్, ఉన్నారు. నిందితులను పట్టుకోడానికి అత్యంత ప్రతిభ కనపరిచి చేదించిన పై పొలిసు అధికారులకు తగిన శాఖా పరమైన రివార్డులు ప్రతిపాదించి అభినందన చెప్పడం జరిగింది.
MOST READ :
-
Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!
-
District collector : వరదలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులకు సూచన..!
-
Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
-
Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!
-
Singer Mangli : చిక్కుల్లో సింగర్ మంగ్లీ.. బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం..!









