Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండలోని వై ఆర్ పి ఫౌండేషన్ హల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామగిరి హైస్కూల్ నందు 1973- 1979 వరకు 8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువు కున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం వై ఆర్ పి ఫౌండేషన్ చైర్మన్ యాలుశాల రవిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకొని క్షేమ సమాచారం అడిగి ఆ విధంగా చేసుకున్నారు ఆనాటి ఆనాటి మధుర స్మృతులను వేసుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు హాజరై తమ ఆనందాన్ని అనుభవాలను పంచుకోవడం జరిగినది.

రామగిరి ప్రభుత్వ పాఠశాలను భవిష్యత్తు లో ఉన్నత స్థాయి కి తీసుకురావాలని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ పి ఫౌండేషన్ చైర్మన్ యాలుశాల రవిప్రసాద్, వెంకటేశం, నేతి రఘుపతి,రవీంద్రనాథ్, రాఘవ, పురుషోత్తం, రాజేంద్రప్రసాద్, వరప్రసాద్, ప్రవీణ్ కుమార్, యమా దయాకర్, పవన్, మేఘయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

  2. Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ మృతి.. కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలని ధర్నా..!

  3. TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

  4. TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

మరిన్ని వార్తలు