Miryalaguda : సబ్ కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ తేదీ వరకు వయస్సు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలి..!
Miryalaguda : సబ్ కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ తేదీ వరకు వయస్సు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలి..!
మిర్యాలగూడ, మనసాక్షి :
మిర్యాలగూడ పట్టణ మరియు మండల పరిధిలోని ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు, BLO APP తదితర విషయాలపై ఈరోజు బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ సూపర్వైజర్స్ కు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం Sub-Collctor కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సబ్- కలెక్టర్, ERO(Electoral registration officer) అమిత్ నారాయణ మాలెంపాటి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారము, ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి 01/07/2025 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు.
అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అందుకే జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి BLO లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు.
ప్రతి BLO మీ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని, పరిపూర్ణమైన ఓటర్ల జాబితాను నమోదు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శర్మ, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ గుడిపాటి కోటయ్య, పోలెబోయిన జనార్ధన్, అంబటి శ్రీను, గోవర్థన్ రెడ్డి , సైదిరెడ్డి, ఉస్మాన్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, రవీందర్ రెడ్డి సూపర్వైజర్లు, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.









