Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

డి మార్ట్ లో ఆకస్మికంగా తనిఖీలు.. కల్తీగా అనుమానించి టీ పౌడర్ సీజ్..!

డి మార్ట్ లో ఆకస్మికంగా తనిఖీలు.. కల్తీగా అనుమానించి టీ పౌడర్ సీజ్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట పట్టణంలో బుధవారం డి మార్ట్ ని వి.జ్యోతిర్మయి,జోనల్ ఫుడ్ కంట్రోలర్,సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ కిరణ్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అనుమానిత ఆహార పదార్థాల షాంపిల్స్ లను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నామన్నారు.

అక్కడ లూస్ గా అమ్ముతున్న టీ పౌడర్ లో కల్తీ ఉన్నట్లు అనుమానించి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపిన్నట్లు చెప్పారు.ప్రయోగశాల నివేదికల ఆధారంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఆహార పదార్థాలలో రంగులు హానికరమైన కెమికల్స్ ని ఉపయోగించరాదని యాజమాన్యంను హెచ్చరించారు.

అలాగే వివిధ వ్యాపారులకు లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు.

నాణ్యతలేని,శుభ్రత పాటించని పలు దుకాణాల వారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్ట ప్రకారం షెడ్యూల్ 4 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫస్సై ప్రకారం పలు నోటీసులు జారీ చేశారు. తర్వాత కల్తీగా అనుమానించి సుమారు 20 కేజీల టీ పౌడర్ ని సీజ్ చేశారు.

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : 

మరిన్ని వార్తలు