Supreme Court : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హక్కుల వర్తించవు..!
సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది.

Supreme Court : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హక్కుల వర్తించవు..!
మన సాక్షి వెబ్ డెస్క్:
సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ క్యాస్ట్ హక్కులను పొందలేడని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటీషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. కాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.
మతమార్పిడి తర్వాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగమని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన పిట్టలవాణిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డి తోపాటు ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా చింతాడ ఆనంద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రామిరెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశాడు.
ఈ కేసును సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్ గా మారాడని, అతను క్రైస్తవాన్ని స్వీకరించారని తెలిపారు. మతం మారిన ఆనందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టులో పిటిషన్ లో పేర్కొన్నారు.
Sc కులాల రాజ్యాంగ 1950లోని మూడవ నిబంధన ప్రకారం హిందువు కానీ వ్యక్తి హిందువులోని ఏ కులానికి చెందిన వాడు కాలేడు. పుట్టుకతో హిందూ అయినప్పటికీ మతం మారడం వల్ల ఆనంద్ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు కాదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు అతడికి వర్తించవు. హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాలలో లేదు. అందువల్ల ఆనంద్ ఫిర్యాదు చట్ట వ్యతిరేకం. ఈ కేసు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. అని రామిరెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
దాంతోపాటు ఆనంద్ తరపు న్యాయవాది వాదిస్తూ ఆనంద్ కి ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ హిందూ సర్టిఫికెట్ ఉంది. అందువల్ల అట్రాసిటీ చట్టం ఆనంద్ కి వర్తిస్తుంది అని వాదించాడు. ఇరువురి వాదనలు విన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాలేడని, అతడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది.
కాగా అక్కల రామిరెడ్డి ఇతరులపై క్రిమినల్ కేసులు కొట్టివేశారు. అయితే ఆనంద్ ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.
MOST READ
- Health Camp : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో రేపు ప్రత్యేక వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోవాలి..!
- మాపై అమెరికా దాడి చేస్తే.. మేము భారత్ పై బాంబులేస్తాం, ఢిల్లీ, ముంబై లక్ష్యం..!
- LPG GAS : గ్యాస్ కొరత నేపథ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..!
- Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్క రోజులో రూ.29,400లకు..!









