Suryapet : సూర్యాపేట జిల్లాలో ఇంటి పైకి దూసుకు వెళ్లిన లారీ..!
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలోని జలాల్పురం స్టేజి వద్ద ఆంజనేయస్వామి గుడి సమీపంలో డబ్బా వెంకన్న ఇంటి పైకి దూసుకు వచ్చిన లారీ.

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఇంటి పైకి దూసుకు వెళ్లిన లారీ..!
తుంగతుర్తి మన సాక్షి :
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలోని జలాల్పురం స్టేజి వద్ద ఆంజనేయస్వామి గుడి సమీపంలో డబ్బా వెంకన్న ఇంటి పైకి దూసుకు వచ్చిన లారీ. ఉదయం నుండి భారీ వర్షంతో రోడ్డంతా చిత్తడిగా ఉండడం లారీ డ్రైవర్ ఒకేసారి తిరుమలగిరి నుండి తొర్రూర్ వెళ్లే మెయిన్ రోడ్డు వెంట ఉదయం 9 గంటల సమయంలో ఇంటిముందు రేకుల కొట్టాన్ని గుద్దేసింది తక్షణమే ఇంట్లో ఉన్న వెంకన్న కుటుంబం భారీ శబ్దంతో రేకుల కొట్టాన్ని గుద్దడంతో వెంకన్న కుటుంబం ఒకేసారి ఉలిక్కిపడ్డారు
పక్కన ఉన్న ఇండ్ల యజమానులు ఒకేసారి భారీ శబ్దంతో వినిపించడంతో వారంతా బయటికి వచ్చి చూడడంతో లారీ ఒకేసారి రోడ్డు దిగి ఇంట్లోకి దూసుకు వెళ్లడంతో వారు కంగుతిన్నారు. హుటా హుటిన అక్కడ ఉన్న ప్రజలు ప్రమాదం జరిగిందని 108 వాహనానికి ఫోన్ కొట్టారు. తక్షణమే మండలంలో ఉన్న 108 వాహనం రావడంతో ఇంటిముందు రేకులని చల్లా చదరంగం కావడం లారీ అద్దాలు పగలడం అందులో ఉన్న వాహనదారులకు అద్దాలు పగిలి దెబ్బలు తగలడంతో వారిని 108 వాహనంలో తరలించారు.
ఇంటిలో ఉన్న డబ్బా వెంకన్న కుటుంబ సభ్యులు వర్షం వస్తుందని ఇంట్లో లేరు వారు వేరే పనిపై బయటికి వెళ్లిపోయారు దీనితో బ్రతికిపోయారు. పెద్ద ప్రమాదం నుండి తప్పుకున్న డబ్బా వెంకన్న కుటుంబ సభ్యులు అక్కడ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని వారి వీధి ప్రజలు వారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం లారీ అతివేగంతో 365 రహదారిని దాటి ఇంటి ఆవరణలో రేకుల కొట్టాన్ని గుద్దడంతో భారీ నష్టం వాటిల్లిందని ఇంటి యజమాని వెంకన్న మొరపెట్టుకుంటున్నారు
లారీ నెంబర్. టీఎన్ 20 బి ఎస్ 0268 లారీ గుద్దడంతో రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వెంకన్న పోలీసులకు తెలిపారు తక్షణమేకేసు నమోదు చేసుకుని ఎస్ఐ వెంకన్న లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ కు దెబ్బలు తాగడంతో అతనిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇంకా వివరాలు తెలియవలసి ఉన్నాయి.










