Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి నుంచి ఆపై చదివిన వారికి సూర్యాపేటలో 25న భారీ ఉద్యోగ మేళా..!

నిరుద్యోగులకు భారీ శుభవార్త అందింది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ & పీజీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ నెల 25న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.

Suryapet : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి నుంచి ఆపై చదివిన వారికి సూర్యాపేటలో 25న భారీ ఉద్యోగ మేళా..!

సూర్యాపేట, మన సాక్షి:

నిరుద్యోగులకు భారీ శుభవార్త అందింది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ & పీజీ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ నెల 25న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మేళాలో సుమారు 200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అపోలో ఫార్మసీ, శ్రీరామ్ చిట్ ఫండ్స్, పవన్ మోటార్స్ తదితర సంస్థలు పాల్గొంటున్నాయి.

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు కలిగిన 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందించనున్నట్లు వెల్లడించారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటాతో హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి ఎం.డి. జాఫ్ పాషా సూచించారు. మరిన్ని వివరాలకు 99896 55489 నంబర్‌ను సంప్రదించవచ్చు అని తెలిపారు.

మరిన్ని వార్తలు