Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట సద్దల చెరువులో  మృతదేహం లభ్యం..!

సూర్యాపేట పట్టణం లోని సద్దల చెరువులో గుర్తుతెలియని పురుషుడు మృతదేహం లభించినట్లు పట్టణ సిఐ వెంకటయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Suryapet : సూర్యాపేట సద్దల చెరువులో  మృతదేహం లభ్యం..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట పట్టణం లోని సద్దల చెరువులో గుర్తుతెలియని పురుషుడు మృతదేహం లభించినట్లు పట్టణ సిఐ వెంకటయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక విచారణలో, సదరు వ్యక్తి అనుకోకుండా ప్రమాదవశాత్తు సద్దల చెరువులో పడిపోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు.

మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, మృతునికి సుమారు 60-65 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. బ్ల్యూ కలర్ లుంగీ శరీరంపై ధరించిన ఉన్నాడని, మృతదేహానికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషనుకు లేదా 8712686005, 8712577224 ఫోన్ నంబర్లను సంప్రదించి సమాచారం అందించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు