క్రైంBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!

గరిడేపల్లి, మన సాక్షి :

ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తిని ఆరు నెలల పాటు కష్టపడి గరిడేపల్లి ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం సంబంధిత వ్యక్తి ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పచెప్పారు. సూర్యాపేట జిల్లా గ రిడేపల్లి మండలం కుతుబ్ షా పురం గ్రామానికి చెందిన షేక్ జాన్ సైదులు కోదాడలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం భార్య అత్తమామలతో గొడవ జరిగి భార్యని విభేదించి కుతుబ్షా పురం గ్రామంలో ఉంటున్నారు.

అక్కడ నుంచి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు సమీప దేశాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరోసారి భార్య అత్తమామలతో గొడవ జరిగి చెప్పకుండా లారీలోలోడును దించేందుకు భూటాన్ దేశానికి వెళ్లి అతడు అక్కడే ఉండిపోయి లారీని మరో డ్రైవర్తో పంపించాడు.

తరచూ లారీ లోడులు తీసుకొని భూటాన్ పరిసర ప్రాంతాలకు వెళుతుండడంతో అక్కడ వ్యక్తులతో పరిచయమైంది. దీంతో వారి సహకారంతో అక్కడ మొక్కజొన్న ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించాడు. భర్త కనిపించకపోవడంతో భార్య ఆస్మా గరిడేపల్లి పోలీస్స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేసింది. పోలీసులు షేక్ జాన్ సైదులు పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఇక అక్కడి నుంచి జాన్ సైదులు సమాచారం కోసం గరిడేపల్లి ఎస్సై చలిగంటి నరేష్ పోలీసు సిబ్బందితో కలిసి ఆరు నెలలుగా కష్టపడ్డారు. సదరు జాన్ సైదులు నెలకు ఒక సిమ్ మారుస్తుండటం భూటాన్ దేశంలో సెల్ పనిచేయకపోవడంతో ఆచూకీ కనుగొనడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో అచ్చా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గరిడేపల్లి ఎస్సై చాకచక్యంగా జాన్ సైదులు ని ఇండియాకు రప్పించారు.

గత 20 రోజుల క్రితం హైదరాబాదుకు చేరిన షేక్ జాన్ సైదులు కదలికలు గుర్తించి ప్రత్యేక నిగా పెట్టారు. ఇక హైదరాబాదులో అతని ఆచూకీ కోసం తమ సిబ్బందితో గాలించి ఎట్టకేలకు పట్టుకొని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు.

జాన్ సైదులు కుటుంబ సభ్యులు, భార్య ఆస్మా, సోదరులు ఎస్కే జానీ బాబాలు పిలిపించి వారికి అప్పగించారు. ఎస్సై చలికంటి నరేష్ తో పాటు గరిడేపల్లి పోలీసు సిబ్బంది నగేష్, విష్ణు, వెంకటేశ్వర్లు నీ ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.

By : SrinivasRao, Garidepally

MOST READ : 

  1. Kamareddy : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు.. ప్రవాహంలో చిక్కిన 30 మంది రైతులు..!

  2. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  3. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  4. Fertilizer : డి సి ఓ కీలక ఆదేశం.. ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలి..!

మరిన్ని వార్తలు